English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Zechariah Chapters

1 బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షయా ( పారశీకం ) రజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. ( జెకర్యా తండ్రి వేరు బెరక్యా. బెరక్య ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.
2 యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు.
3 కావున ప్రజలకు మీరీ విషయాలు తప్పక చెప్పాలి. యెహోవా ఇలా చెపుతున్నాడు, “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
4 యెహోవా చెప్పాడు: “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో ఇలా మాట్లాడారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పారు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
5 దేవుడు చెప్పాడు: “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు.
6 ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించు కొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చు కున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చెసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కాపున వారు దేవుని వద్దకు తిరిగి పచ్చారు.”
7 పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (శెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. ( జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో. ) ఆ వర్తమానం ఇది.
8 రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయుట నేను చూశాను. అతడు లోయలో కొన్ని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎరుపు, గోధుమరంగు మరియు తెలుపురంగు గుర్రాలు ఉన్నాయి.
9 “అయ్యా, ఈ గుర్రాలు ఎందుకు?” అని నేను అడిగాను. అప్పుడు దేవదూత నాతో మాట్టాడుతూ, “ఈ గుర్రాలు ఎందుకో నేను నీకు చూపిస్తాను” అని చెప్పాడు.
10 పిమ్మట కదంబ చెట్ల మధ్య నిలుచున్న మనిషి చెప్పాడు, “యెహోవా ఈ గుర్రాలను భూమిపై ఇక్కడా, అక్కడా తిరగటానికి పంపించాడు.”
11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూమిపై ఇక్కడా, అక్కడా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.
12 పిమ్మట యెహోవా దూత చెప్పాడు: “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావు.”
13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.
14 తరువాత దేవదూత ఈ విషయాలను ప్రజలకు చెప్పుమని నాతో చెప్పాడు: సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “యెరూషలేము పట్ల, సీయోను పట్ల నాకు గాఢమైన ప్రేమ ఉంది.
15 మిక్కిలి రక్షణ కలిగి యున్నామని భావించే దేశాల పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నాకు కొంచెం కోపం వచ్చింది. అప్పుడు నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను. కాని ఆ రాజ్యాలు చాలు హాని చేశాయి.”
16 కావున యెహోవా చెపుతున్నాడు: “నేను యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది. మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుంది.”
17 దేవదూత చెప్పాడు, “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవీ చెపుతున్నాడు: నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి. నేను సీయోనును ఓదార్చుతాను. నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను.’ ”
18 అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను.
19 నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను. అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”
20 తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు.
21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను. అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికి కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”
×

Alert

×